అందరికి నమస్కారం, ప్రింట్ మీడియాలో నానోల విప్లవాన్ని చూడండి & visit NANOLU group in facebook also ఈగ హనుమాన్

Monday, September 26, 2011

జ్యోతిర్మయి మళ్ళ గారి నానోలు


1
శిఖరం
అగాధం
ప్రేమ
చిరునామాలు-

2
జీవితకాలం
వెదుకులాట
ఫలితం
నేను-

3
నాకోసం
వెతికాను
నువ్వు
దొరికావు-

4
రోజు
ఒకపాఠం
జీవితకాలం
కోర్సు-

5
ఆమె
మహాకావ్యం
ఆఖరిపేజీ
అడ్రసేలేదు-

6
మాట
ఒక్కపలుకే
మౌనం
లెక్కలేనన్ని-

6
దుఖం
ఓపికపట్టొద్దూ
ఉల్లిపాయ
కోసేంతవరకూ-

7
నీరు
పల్లమెరుగు
నానో
నాణ్యమెరుగు-

8
ఏకాంతమూ
సుఖమే
మదినిండా
నీవుండగా-

9
ఆవేశం
ఆలోచన
పగలు
రేయి -

10
సూక్ష్మం
సునిశితం
సుభాషితం
నానో-

11
కామం
గదివరకు
ప్రేమ
తుదివరకు-

12
చిగురంత
దానం
తరువంత
ప్రయోజనం-

13
స్త్రీశక్తి
మహావృక్షం
కట్టిపడేస్తే
బోన్సాయ్ -

14
కాలుష్యం
వైరస్
సుస్తీలో
భూగోళం-

15
భాష
కాదు
ఆలోచన
కవిత్త్వం-

జ్యోతిర్మయి మళ్ళ గారి నానోలు

1
అన్నదాత
పేరన్నా
గంజినీరు
కరువన్నా-

2
నోట్లేస్తే
ఓట్లపంట
సాగుచేస్తే
అవినీతిపంట-

3
ఎండమావి
జీవనయానం
చూస్తూనే
సాగించాలి-

4
ఎదుటనే
అన్నీ
ఎంచుకో
హంసలా-

5
గడిచినవి
అనుభవాలు
మరువనివి
జ్ఞాపకాలు-

6
ఆశయం
ఆకాశమంత
సాధన
సాగరమంత-

7
చదవడానికే
జీవితపుటలు
రాయలేము
చెరపలేము-

8
విశ్వాసం
బలం
పరిశ్రమ
ఫలం-

9
కలవకముందు
నువ్వెవరో
కలిసినాక
నేనెవరో-

10
చూపుకి
చెరువంత
దక్కేది
దోసెడంతే-

జ్యోతిర్మయి మళ్ళ గారి నానోలు

1
గోరుముద్దంత
అమ్మ
గోదారంత
ప్రేమ-

2
ప్రేమ
సంద్రమంతైతే
గుండె
వరదవదా?-

3
విద్య
ప్రేమ
పంచేద్దాం
పెరుగుతాయి-

4
ఆడబిడ్డ
అడ్డమా
వడ్లగింజ
ఆయుధమా?-

5
ఉప్పెన
దుఖం
ఆనకట్ట
ఓదార్పు-

6
ఎవరు
నువ్వు
అదే
ఆలోచిస్తున్నా-

7
నువ్వు
నేనే
తక్కిందంతా
శూన్యం-

8
మోహం
ఎంత?
మౌనం
ఆగనంత-

9
నిర్లక్ష్యం
విత్తనాలు
అవినీతి
మహావృక్షాలు-

10
చీడపురుగు
చెట్టుకీ
అవినీతిపరుడు
దేశానికీ-

Wednesday, September 7, 2011

మరి కొన్ని ఎన్.శ్రీనివాస్ రెడ్డి గారి నానోలు

1
రాళ్ళూ..
రప్పలు..
నమ్మితే
దేవుళ్లు -

2
గుండె
రాయైతే
కళ్లు
ఎడారే -

3
మనసు
మౌనవ్రతం
బుద్ధి
వెలుగునేత్రం-

4
మొదలు
తుది
రెండిట్లో
ముందేది?

5
ఆలోచనల
వరద...
కొట్టుకు
పోతున్నా-

6
చుట్టూ
మనుషులే -
మానవత్వం
ఎక్కడ?

7
విదేశం
ఉద్యోగం
మాతృదేశం
వియోగం-

8
ఆశలు
ఇసుకగూళ్లు
కాలం
కెరటాలు