అందరికి నమస్కారం, ప్రింట్ మీడియాలో నానోల విప్లవాన్ని చూడండి & visit NANOLU group in facebook also ఈగ హనుమాన్

Tuesday, March 10, 2009

డాక్టర్ ద్వా.నా.శాస్త్రి గారు, ఈగ హనుమాన్ "నానోలు, కవిత్వం X 10-9" సంపుటికి రాసిన ముందు మాట:

మరో సరికొత్త కవితా రూపం "నానోలు"
-డాక్తర్ ద్వా.నా.శాస్త్రి, ది: 13-12-2005.

తెలుగు కవిత్వం ఎప్పుడూ పదహారేల్ల కన్య లాగానే ఉంటుంది. అంటే నిత్య యవ్వనం గలది. దీనికి కారణం కాలంతో పాటు తెలుగు కవిత్వమూ మారటం, సమకాలీనత్వాన్ని స్వాగతించటం. ఇతిహాస కవిత్వం నుంచి నేటి వరకు తెలుగులో ఎన్నో కవితా రూపాలు వెలువద్దాయి. కొన్ని రూపాలు కొన్ని కాలాలలో ప్రాచుర్యం పొందాయి. కొన్ని రూపాలు కనుమరుగైపోయాయి (ఉదాహరణకు: వాంగ్మయం). పద్యం, గేయం, వచన కవితా అనే రూపాలు తెలుగు కవిత్వాలు ఉన్నంత కాలం స్థిరంగా ఉంటాయని కవితా పరిణామాన్ని, ఈ ౠపాల నిర్మాణ ప్రాచుర్యాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది.

వచన కవిత్వ రూపంలో భాగంగాంగానే మినీ కవిత, హైకూ, నానీలు అనే రూపాలు వెలువడ్డాయి. మినీ కవిత కొంత కాలం ఉద్యమ స్థాయిలొ విజృంభించింది. 'హైకూ' విదేశీ కవితా లక్షణాలకు లొంగకపోయినా కొంత ప్రచారం పొందింది. నానీలు కవితా రూపం స్థిరపడి అనుయాయులతో వ్యాప్తికెక్కింది. నేటికీ నానీలు వెలువడుతూనే ఉన్నాయి.
ఇప్పుడు ఈగ హనుమాన్ "నానోలు" రాశారు. శాస్త్ర నేపధ్యం గల శీర్షిక ఇది. సాంకేతిక శాస్త్రం ప్రకారం 'నానో' అంటే సూక్ష్మాతి సూక్ష్మాతి సూక్ష్మం. కవిత్వాన్ని కూడా ఇదే విధంగా సూక్ష్మాతి సూక్ష్మ స్థాయిలో రాయవచ్చు గదా- అన్న ఆలోచన రాగా ఈగ హనుమాన్ నానోలు రాశారు.

"నానోలు" మరో ప్రయోగం. ఈ కొత్త కవితా రూప లక్షణాలను కవి మాటలలో తెలుసుకుందాం. నాలుగు పాదాలు, పాదానికి ఒకే ఒక్క పదం. ఏ కవితా రూపానైనా క్లుప్తత గాద్గత తప్పని సరి. అల్పాక్షరాలతో అనల్పర్ధా రచన అన్నది ప్రాచీన కవుల మాటే. మినీ కవిత్వం, హైకూలు, నానీలు..... ఈ సాత్రాన్ని పాటించాయి. ఇప్పుడు "నానోలు" కవి ఈగ హనుమాన్ కూడా ఇదే ప్రయత్నం చేశారు. సినాఋఏ గారు అన్నట్లు ఇటువంటి రూపాలు "సౌదమి"(మెరుపు) లాగా ఒక ఫ్లాష్ లాగా తళుక్కుమనిపించే గుణం కలవి. ఒక స్మృతిని లేదా ఒక అనుభూతిని లేదా ఒక తత్వాన్ని స్ఫురింప చేయడమే నానోల లక్ష్యం. చెప్పాలనుకున్న విషయం సూటిగా చెప్పాలని కవి ఆశయం.

"పట్నం
పాపానికి
పల్లె
ఉపవాసం-"


ఇందులో నగరీకరణ, పల్లె విధ్వంసానికి దారితీస్తోందని చురుక! పల్లెలు బలపడడం లేదు. పల్లెను పస్తు ఉంచుతున్నారు. ఈ పాపం పట్నానిదే. మన పరిపాలకుల "దుర్-దృష్టి" దీనికి కారన్ణం. ఇంత భావాన్ని ఆలోచింపచేసేలా చిన్న పదాలతో రాశారు. ఇదేవిధంగా టీ.వి చానల్ల విష సంస్కృతిపై, క్రికెట్ పిచ్చిపై ఈగ హనుమాన్ నానోల అస్త్రాల్ని సంధించారు.

"కప్డా
రొఠీ
మఖాన్
కరెంట్-"


ఇందులో కొండంత భావం ఉంది. సమకాలీన సామాజిక వాస్తవికత ఉంది. ఒక నాడు బట్ట, తిండి, ఇల్లు మాత్రమే నిత్యావసర వస్తువులు. ఇవే మానవుడు జీవించడానికి మూలం. కానీ, పరిపాలకుల నిర్వాకం వల్ల వీటికి కరెంట్ తోడైంది. రైతుల ఆత్మ హత్యకు కారణమైంది. ఇటువంటి సామాజిక స్పృహ గల నానోల వల్ల రూపానికి బలం చేకూరుతుంది. అంటే లక్షనాల కన్నా వస్తు బలం, సమకాలీనత రూపానికి పుష్టి చేకూరుస్తాయి.

"పోలీసుతో
మాటా?
పెట్టేస్తాడు
పోటా!"


ఇది పైన పేర్కొన్న వస్తుబలం గల కవిత. 'పోలీసులతో పెట్టుకోకూ అన్నది కవి సందేశం. ప్రజాస్వామ్యంలో ప్రజలకన్న పోలీసులదే హవా అని సారాంశం.

ఈ నానోలులో సమాజిక స్పృహ గలవి, సమకాలీనత గలవిచాలా ఉన్నయి. అయితే హనుమాన్ కవితల్లో వస్తు వైవిధ్యం, వస్తు వైశిష్ట్యం కూడా చూస్తాం.
ఉదాహరణకి:

"శిశిరం
గాయానికి
వసంతం
ఆయింత్ మెంట్-"


ఇలా చెప్పడం కొత్తదనమే. ఇటువంటి అభివ్యక్తి, నవ్యత ఈ నానోలలో ఉంది. వస్తు నవ్యత, వ్యకీకరణ నవ్యతలతో పాటు నానో కవితలోనే శబ్ధ శిల్పం కూడా ప్రదర్శించడం విశేషం. మచ్చుకు:

"ఎలక్షన్లొ
రిగ్గింగ్
ప్రజాస్వామ్యం
ర్యాగింగ్-"


నేటి తల్లిదంద్రులకు ఈగ హనుమాన్ గొప్ప చురక వేస్తూ హితవులు నాకు బాగా నచ్చింది.

"పేరెంట్స్
ప్రేమించకపోతే
పక్కింటబ్బయి
ప్రేమిస్తాడు-"


ఈ విధంగా ఈగ హనుమాన్ కొత్త కవితా రూపాన్ని శక్తివంతంగా అందించాడు. సూక్ష్మాతి సూక్ష్మాతి సూక్ష్మ రచనలో 'గోరంత దీపం కొండంత వెలుగూ గా భావాలు వెల్లడించి కొత్త కోణన్ని ప్రదర్శించినందుకు అభినందిస్తున్నాను. నానోల కవితా రూపం స్థిర పదుతుందో లేదో కాలం చెబుతుంది. తెలుగు కవులు, పాఠకులు, విమర్శకులు ఎప్పుడూ కొత్తదనానికీ స్వాగతం చెబుతున్నట్లే హనుమాన్ 'నానోలకి చెబుదాం.
-డాక్తర్ ద్వా.నా.శాస్త్రి, ది: 13-12-2005.

Monday, March 9, 2009

మరో ఇరవై నానోలు;

1
బింధువూ
సింధువు
దూకితే
సింధువే-

2
నింగి
నేలను
ముద్దాడి
నీళ్ళాడింది-

3
కాంట్రాక్టు
సర్పంచుకి
కాసులు
దొరగారికి-

4
పువ్వు
బలై
కాయై
నవ్వు-

5
కాలమైతే
షుగర్ కేన్
కాకపోతే
నువాక్రాన్-

6
గ్రాముల
క్రొవ్వత్తిలో
గ్రామాల
వెల్తురు-

7
నాకు
కావలిసింది
చీకటే
వెల్గించటానికి-

8
అగ్గిపెట్టె
ఆఠానా
లక్షలు
ఎందుకమ్మా-

9
తొలకరి
చిలుకరింత
రోహిణీ
మొహనం-

10
ప్రకృతి
ఫ్యాషన్
మార్చుకుంటే
వసంతం-

11
అన్నలకై
వెన్నెల
అడవి
కాచింది-

12
బాధిస్తే
భూమి
వెక్కిల్లు
భూకంపం-

13
ప్రకృతి
కోల్డ్ వ్యాక్సింగ్
వచ్చేసింది
శిశిరం-

14
తల్లిదంద్రులు
ప్రేమించకపోతే
పక్కింటబ్బాయి
ప్రేమిస్తాడు-

15
పాక
సమర్ధాడితే
గడీలో
ఆటపాటలు-

16

మల్లెపువ్వు
నా
పల్లెనవ్వు-

17
కరువా
కన్నీళ్ళు
తాగి
బతకండి-

18
కన్నీళ్ళు
గాయమా?
కాదు
ఆయింట్మెంట్!!-

19
చరిత్ర
మరిస్తే
కాలం
క్షమించదు-

20
నెత్తురూ
కలవరిస్తోంది
ఎర్రగా
పారుతున్నందుకు-

Sunday, March 8, 2009

నానోల వరద:

1
నాగలి
దున్నదిక
బొందలు
తవ్వుతుంది-

2
మహారాజు
సుఖ:నిద్ర
మహామంత్రి
సుఖీభవ-

3
ఉప్పునొదిలి
ఆవిరైతే
బంగాళమే
గంగమ్మ-

4
ఉగ్రవాదం
రావనకాష్టం
పసిఫిక్ లో
పంపెట్టు-

5
అగాధమౌ
జలనిధిలో
అనాదిగా
వెదుకులాట-

6
క్రౌంచమిధున
శోకం
కవికయ్యే
శ్లోకం-

7
కరువు
గోదారి
పరవల్లై
పారుతుంది-

8
యుగయుగాల
బానిసా
యుగాంతం
వచ్చేసిందిక-

9
నగరంలో
అందరు
ఒంటరి
ఒంటలే-

10
నిషేధిస్తే
అక్షరాలు
ఆవిరై
కుంభవృష్తి-

11
అంతా
చీకటి
నిద్రేం
పోను-

12
నేను
ఫోటో
నెగిటివ్
మృత్యువు-

13
అప్పులు
ఇస్తున్నారు
ఎండ్రిన్
కొనుక్కోండి-

14
కనబడిందా
ఒయాసిస్సు
వచ్చేవి
ఎలక్షన్స్-

15
నాలుగే
పదాల్తో
నవమార్గం
నిర్మిద్దాం-

16
నాలుగే
పదాలు
పాదాలు
నానోలు-

17
ప్రకృతి
ఏడ్చినా
మాడ్చినా
కరువే-

18
నగరంలో
మూసీ
మాసిన
మందాకిని-

19
గమ్యం
కదిలితే
విజయం
రమ్యం-

20
నింగి
నేలను
ముద్దాడి
నీళ్ళాడింది-

మరిన్ని నానోలు:

1
గ్లోబలైజేషన్
లిబరలైజేషన్
ప్రైవేటైజేషన్
కాల్మొక్త బాంచెన్-

2
తంగేడుపువ్వు
ఆన
నా తల్లి
తెలంగాణ-

3
బారులో
బీరెండదు
బావుల్లో
నీరుండదు-

4
నోరు
మూసుకు
కూర్చోలేను
మనిషిని-

5
రాసిందే
రాసుందా
రాసినోడు
గోవిందా-

6
అమేరికాది
యెదవబుద్ది
అవుద్దెపుడొ
అట్లతద్ది-

7
మార్పు
శాశ్వతం
తూర్పే
పశ్చిమం-

8
సాలివాడి
నరాలు
పడుగుపేక
దారాలు-

9
పాశ్చాత్యం
డియోడరెంట్
భారతీయం
శ్రీగంధం-

10
చినుకు
చుంబిస్తే
మట్టి
పువ్వే-

11
పాకిస్తాన్
నెయ్యమా
పట్టింది
దెయ్యమా-

12
పనిచేస్తే
లేబర్
ఎగ్గొడితే
లీడర్-

13
ప్రేమ
పురుడు
పోసుకుంటే
పాపాయి-

14
రూపాయి
రోగికి
డాలర్
ఏయిడ్స్-

15
బుర్రలు
పొర్లి
గ్రద్ధ
నోట్లోకి-

16
హృదయం
ఊగితే
అక్షరం
రాల్తుంది-

17
పసిఫిక్
లోతెంత
పత్తిరైతును
అడుగుపొ-

18
వెన్నెల
గుచ్చుకుంటే
ఎన్నెన్ని
కలలనీ-

19
బిగ్ బ్యాంగ్
బిగ్ క్రంచ్
పునరపి
పునరపి-

20
తప్పితే
జాలరి
తుఫానో
పాకిస్తానో-