అందరికి నమస్కారం, ప్రింట్ మీడియాలో నానోల విప్లవాన్ని చూడండి & visit NANOLU group in facebook also ఈగ హనుమాన్

Saturday, March 7, 2009

అసలు నానోలు అంటే ఏంటో, ఎలా ఉండాలి:

నాలుగే
పదాలు
పాదాలు
నానోలు-

కడివెడు
కాగీకాగీ
కలాకండ్
నానో-

నానోలే నానోలు:

1
మట్టిలోకి
తొక్కినా
చీల్చుకొస్తుంది
విత్తనం-

2
ఎన్ని
నీడలు
ఒక్క
ఆకారానికి-

3
మరుపు
పొరల్లో
ఎన్నెన్ని
జ్ఞాపకాలో-

4
అక్కడ
అడుక్కున్నా
ఇక్కడ
దొరబాబే-

5
పిల్లకి
స్కూల్ వర్క్
తల్లికి
హోం వర్క్-

6
నిశ్శబ్దాన్ని
మీటితే
రాగాలు
పల్కుతాయి-

7
కోటి
జలపాతాలు
కొలనుకే
దారి-

8
దృశ్యం
మారుతుంది
దృక్పథం
మార్చుకో-

9
ఆకాశం
నీలం
దానికదే
శీలం-

10
శిశిరం
గాయానికి
వసంతం
ఆయింట్మెంట్-

11
మూస్తే
కలలు
తెరిస్తే
కళలు-

12
బావులు
ఇంకితే
బోర్లు
పొడుచుకొస్తై-

13
ఊరు
సూర్యుడు
ఆర్పేసినా
ఆరడు-

14
అక్షరం
ఎలక్త్రాన్
కవిత్వం
కరెంత్-

15
నాదు
ఏస్టిండియా
వచ్చేది
వెస్తేనయా-

16
ఎలక్షన్లో
రిగ్గింగ్
ప్రజాస్వామ్యం
ర్యాగింగ్-

17
బతికున్నా
దెయ్యాలు
చనిపోతే
దేవతలు-

18
టెలీఫోన్
సెలవమ్మా
సెల్ ఫోన్
ముద్దుగుమ్మా-

19
హైద్రాబాద్
ఆటోలు
తూటాలా
తుమ్మెదలా-

20
చుక్కల్లో
చంద్రుడు
ఒంటరి
కుందేలు-

మరిన్ని నానోలు:

1
మెట్టుకు
ఇద్దరు
బిచ్చగాల్లు
దేవళమే-
2
వేకువనై
వస్తాను
చీకటి
వర్షించినా-
3
అనంతమౌ
విశ్వంలో
వెల్తురూ
ప్రవాహమే-
4
చీకట్లను
చిదిమేసే
మార్పును
ఉదయించనీ-
5
దొరోరి
కుక్కా
దొరోడి
దిక్కే-
6
రాస్తే
నిండుకునేది
సిరాయా?
చేకటి!-
7
నోరెత్తిన
గొంతుక
తడారి
పోనీకు-
8
అనాధ
ముసల్ది
అండరి
పుస్తకం-
9
న్యాయాన్యాయాల
నడిమి
పొర
ఉరేస్కుంది-
10
క్వశ్చన్ మార్క్
క్రింది
చుక్కను
నేనే-
11
కప్డా
రోఠీ
మఖాన్
కరెంట్-
12
పిల్ల
హమాలీలు
బడికి
పిల్లలు-
13
క్రికెట్
పిచ్చే
క్రీడలన్నీ
చచ్చే-
14
"మన"
మధ్య
టీ.వీ
తెర-
15
అందరిలో
ఒకడినే
అందులోనూ
ఒంటరినే-
16
పోలీసుతో
మాటా
పెట్టేస్తాడు
'పోటా'-
17
గోపీవి
నానీలు
హనీవి
నానోలు-
18
మౌనం
మాట్లాడితే
కనుచూపులే
భాషలు-
19
జ్ఞానం
పంచు
అజ్ఞానం
అనుభవించు-
20
మరీ
వేగం
మరో
లోకం-

మరిన్ని నానోలు:

1
మెట్టుకు
ఇద్దరు
బిచ్చగాల్లు
దేవళమే-
2
వేకువనై
వస్తాను
చీకటి
వర్షించినా-
3
అనంతమౌ
విశ్వంలో
వెల్తురూ
ప్రవాహమే-
4
చీకట్లను
చిదిమేసే
మార్పును
ఉదయించనీ-
5
దొరోరి
కుక్కా
దొరోడి
దిక్కే-
6
రాస్తే
నిండుకునేది
సిరాయా?
చేకటి!-
7
నోరెత్తిన
గొంతుక
తడారి
పోనీకు-
8
అనాధ
ముసల్ది
అండరి
పుస్తకం-
9
న్యాయాన్యాయాల
నడిమి
పొర
ఉరేస్కుంది-
10
క్వశ్చన్ మార్క్
క్రింది
చుక్కను
నేనే-




Sunday, March 1, 2009

నానో కవిత్వం - పరిచయం

నానో కవిత్వం - పరిచయం

సూక్ష్మత, ఆర్ద్రత, గుప్తత కల్గిన కవిత్వం సరాసరి గుండెను తాకుతుంది. సూదిలా గుచ్చుకుని, ఉటంకించడానికి వీలుగానూ ఉంటుంది. నాలుగే నాలుగు పదాలు పాఠకుల్ని కదిలించి, జ్ఞాపకమై నిలిచిపోతే? సరిగ్గా ఈ ఆలోచనలోంచే రూపుదిద్దుకున్నై "నానోలు, కవిత్వం X 10-9"

వచన కవిత్వం నిడివి తగ్గినప్పుడు కవిత్వాన్ని 'మినీ కవిత్వం' అన్నారు. తర్వాత వచ్చిన రూప ప్రక్రియల్ని (నానీలు, హైకూలు) 'మైక్రో కవిత్వమన్నారు. నానో టెక్నాలజి రాజ్యమేలుతున్న నేటి రోజున కవిత్వాన్నీ సూక్ష్మాతి సూక్ష్మ స్థాయిలో చెప్పడానికే "నానోలు". నానో అంటే సూక్ష్మాతి సూక్ష్మం (10-9) అని అర్ధం. ఈ పేరు భౌతిక శాస్త్ర పారిభాశిక పదం. నానోల పుట్టిన కాలం మే'2005. సృష్టికర్త - ఈగ హనుమాన్. నానోలు విరివిగా రాసిన వారిలో ప్రముఖంగా చెప్పుకోవల్సంది: పోతగాని సత్యనారాయణ, బొమ్మరాత యెల్లయ్య, మాల్యశ్రీ, కాసర్ల రంగారావు, శిరంశెట్టి కాంతారావు..మరియు ఇంకొందరు..

ఇక, నానో రూప కవిత్వ లక్షణాలు చూద్దాం.
--> నాలుగు పాదాలు.
--> పాదానికి ఒకే ఒక్క పదం. సమాసం, సంధి ఐనా సరే.
--> యెంత సూక్ష్మత పాటిస్తే అంత చిక్కగా, పదునుగ, ప్రభావవంతంగా ఉంటాయి.

ఐతే సుమా! ఇది కవిత్వం, పదం మీద పదం-నాలుగు పదాలు కూర్చితే వచ్చేవి నానోలు కావు. ఈ జాగ్రత్త అత్యవసరం. కొన్ని నానోలు నా బ్లాగులో ఉన్నై రుచి చూడండి.

దాదాపు అన్ని ముఖ్యమైన పత్రికలు నానోలని ప్రచురించాయి.