అందరికి నమస్కారం, ప్రింట్ మీడియాలో నానోల విప్లవాన్ని చూడండి & visit NANOLU group in facebook also ఈగ హనుమాన్

Friday, March 27, 2009

చందుపట్ల శ్రీధర్ గారి నుండి అందిన కొన్ని నానోలు

చందుపట్ల శ్రీధర్ గారి నుండి అందిన కొన్ని నానోలు:

1

బొమ్మా

బొరుసూ

దేవుడూ

సైన్సూ -

2

కొలనులో

చందమామ

పేదరాసిపెద్దమ్మ

కనిపించలేదు-

నువ్వు

నేనైనా

నేనేపుడూ

నేనే-

4

అన్నా!

ఎట్లున్నవే?

సావు

రాదంట!-

5

పబ్ లో

వేలు

ప్లగ్ లో

వేలు-

6

పసికూనలు

చితికితే

యింక

దేవుడెందుకు?-


7

కార్పొరెటు

ఆస్పత్రులు

కార్పెటేసిన

అంపశయ్యలు-


8

జాబిలిపై

చెరిగిన

సంతకం

పేదరాసి పెద్దమ్మ-

9

సైన్సు

గ్యారంటీ

దేవుడు

వ్యారంటీ-

10

యివాళెందుకో

యాసిడ్

గొంతులోంచి

జారుతున్నట్టు-


11

యాసిడ్

వర్షంలో

రాల్తోన్న

మల్లెమొగ్గలు-


12

నీ

నిశ్చబ్ద

నిష్క్రమణం

శబ్దమవుతోన్నవేళ-

Thursday, March 26, 2009

వర్షాన్ని నానోల్లో చెప్పిన కనుమూరి జాన్ హైడ్

వర్షమంటే...

1
వర్షం
అంటే
చినుకుల
సవ్వడి-

2
కాగితపు
పడవల
బాల్యపు
గుర్తులు-

3
వోణీ
తడిసి
వొంపిన
వయ్యారం-

4
చినుకు
చిరుకాంతి
ఆకాశంతెర
హరివిల్లు-

5
ఎండిన
విత్తనానికి
జీవం
పోయడమే-

6
నెరలిల్లిన
నేలతల్లిని
పదును
చేయడమే-

7
పెళ్ళలుగా
పగిలిన
పుడమికి
పులకరింపే!-

8
దాహంగొన్న
భూమికి
తొలకరిజల్లై
సేదదీర్చడమే!-

9
ఘనీభవించిన
మేఘం
చినుకై
ద్రవీభవిండమే!-

10
కురిసి
కురిసి
పొంగిపొర్లే
ప్రవాహమవ్వడమే!-

వర్షాన్ని నానోల్లో చెప్పిన కనుమూరి జాన్ హైడ్

వర్షమంటే...

వర్షం
అంటే
చినుకుల
సవ్వడి

కాగితపు
పడవల
బాల్యపు
గుర్తులు
వోణీ
తడిసి
వొంపిన
వయ్యారం
చినుకు
చిరుకాంతి
ఆకాశంతెర
హరివిల్లు
ఎండిన
విత్తనానికి
జీవం
పోయడమే
నెరలిల్లిన
నేలతల్లిని
పదును
చేయడమే
పెళ్ళలుగా
పగిలిన
పుడమికి
పులకరింపే!
దాహంగొన్న
భూమికి
తొలకరిజల్లై
సేదదీర్చడమే!
ఘనీభవించిన
మేఘం
చినుకై
ద్రవీభవిండమే!
కురిసి
కురిసి
పొంగిపొర్లే
ప్రవాహమవ్వడమే!

ఉషా గారి నుండి అందిన మరి కొన్ని నానోలు.

ఉషా గారి నుండి అందిన మరి కొన్ని నానోలు.

జ్ఞాపకాల
ఒరవడి
మనసున
అలజడి -

సన్నిధి
పరవశం
వియోగం
పరిమళం-

సమక్షం
సెలయేరు
పరోక్షం
ప్రళయం-

ఆస్వాదన
మకరందం
ఆలాపన
అమృతం-

అభీష్టం
అతిశయమైతే
నైరాశ్యం
అనివార్యమౌను-

అభిమానం
ఆరోహణ
అభిజాత్యం
అవరోహణ-

ఆలోచనలు
తాటాకుచప్పుళ్ళు
ఆచరణలు
కుందేటికొమ్ములు-

ఆశలౌతాయేమో
ఎండమావులు
ఆశయాలు
జలాశయాలు-

ఓటమి
కాటుకి
ఓరిమి
విరుగుడు-

సాహసిస్తే
ఒంటరైనా
సాధించడా
పోరాటం-

Tuesday, March 24, 2009

ఉషా గారి నుండి అందిన కొన్ని నానోలు

ఉషా గారి నుండి అందిన కొన్ని నానోలు:

1
మాటలు
పదును
చేతలు
వదులు-

2
అనుభవం
ధ్వని
అనుభూతి
ప్రతిధ్వని-

3
కవనం
మధురం
కలవరం
సుమధురం-

4
వేదన
వూటబావి
శోధన
వూబి-

5
ప్రశంస
పన్నీరు
పొగడ్త
అత్తరు
-

శిరంశెట్టి కాంతారావు గారి దగ్గరి నుండి అందిన నానోలు

శిరంశెట్టి కాంతారావు గారి దగ్గరి నుండి అందిన నానోలు:
1
కమ్యూనిజం
కాలం
కాటేయని
నిజం-

2
భూభారాన్ని
మోస్తున్న
ఆదిశేషు
హమాలి-

3
ప్రపంచంలో
ఒకేఒక్కటి
నిజం
అమ్మ-

4
క్యాస్ట్రొ
అభిజాత్యపు
గుండెల్లో
గ్యాస్త్రో-

5
చిరంజీవీ
లాకప్పులో
ఒకరోజు
బ్రతికొస్తే-

6
క్యాపిటలిజం
ఒక్కడజీర్తి
వందల
ఆకలి-

7
అఫ్ఘనిస్తాన్
దొంగాపోలీసాట
ధ్వంసమైన
రంగస్థలం-

8
ప్రశ్న
ప్రగతికి
తల్లి
తొలి అడుగు-

9
దౌర్జన్యం
మొరటు
పేటెంట్
నాజూకు-

10
ఎం.యస్.స్వామి
నవభారత
ఆసామి
శిరసానమామి-

11
అర్జెంటీనా
సంస్కరణల
పెద్దన్న
మనదారీ!!-

12
స్నేహం
మల్లెపొద
ఆప్యాయతల
గుభాళింపు-

13
బంధుత్వం
విచక్షణను
కప్పేస్తే
అంధత్వం-

14
స్వార్థం
లావా
సంస్కారాన్ని
దహిస్తుంది-

15
ఉగ్రవాదం
వ్యవసాయం
రక్తపాతం
ఫలసాయం-

16
మౌనం
మనసును
కోసే
మెత్తనికత్తి-

17
నాడు
వందేమాతరం
నేడు
మందేభారతం-

18
దుఖం
రాబోవు
సుఖాల
సుగంధధూపం-


Sunday, March 22, 2009

ఆంగ్లం లో నానోలు (నానోస్=nanoes)

AWAITING

నానోల పుస్తకం


క్రౌంచమిధున
శోకం
కవికయ్యే
శ్లోకం-








లాడెన్
గెడ్డం

గీకేస్తే
బుష్-


క్రౌంచమిధున
శోకం
కవికయ్యే
శ్లోకం-














































జాన్ హైడ్ కనుమూరి గారి నుండి అందిన పది నానోలు

నానోలు
1
రాలే
శిశిరం
వసంత
ఆగమనం

2
కడిగిన
కన్ను
మలినరహిత
మనసు

3
మరిగే
ఆలోచనలు
మనసు
రణరంగం

4
విజయం
అపజయం
బొమ్మా
బొరుసు

5
సీత
గీత
దాటితే
యుద్దమే!

6
చిగురు
వగరు
కోకిల
వసంతగానం

7
రెక్కలు
ఉహలు
కలలు
అందమే!

8
పప్పు
ఉప్పు
నిప్పు
వంటకమే!

9
నిజం
నిశ్శబ్దం
నిర్మానుష్యం
భయపెట్టేవే!

10
ఎవరి
లంకకు
వారే
లంకేశ్వరులు
http://johnhaidekanumuri.blogspot.com/2009/03/blog-post.html