శిరంశెట్టి కాంతారావు గారి దగ్గరి నుండి అందిన నానోలు:
1కమ్యూనిజం
కాలం
కాటేయని
నిజం-
2
భూభారాన్ని
మోస్తున్న
ఆదిశేషు
హమాలి-
భూభారాన్ని
మోస్తున్న
ఆదిశేషు
హమాలి-
3
ప్రపంచంలో
ఒకేఒక్కటి
నిజం
అమ్మ-
ప్రపంచంలో
ఒకేఒక్కటి
నిజం
అమ్మ-
4
క్యాస్ట్రొ
అభిజాత్యపు
గుండెల్లో
గ్యాస్త్రో-
క్యాస్ట్రొ
అభిజాత్యపు
గుండెల్లో
గ్యాస్త్రో-
5
చిరంజీవీ
లాకప్పులో
ఒకరోజు
బ్రతికొస్తే-
6
క్యాపిటలిజం
ఒక్కడజీర్తి
వందల
ఆకలి-
క్యాపిటలిజం
ఒక్కడజీర్తి
వందల
ఆకలి-
7
అఫ్ఘనిస్తాన్
దొంగాపోలీసాట
ధ్వంసమైన
రంగస్థలం-
8
ప్రశ్న
ప్రగతికి
తల్లి
తొలి అడుగు-
ప్రశ్న
ప్రగతికి
తల్లి
తొలి అడుగు-
9
దౌర్జన్యం
మొరటు
పేటెంట్
నాజూకు-
10
ఎం.యస్.స్వామి
నవభారత
ఆసామి
శిరసానమామి-
ఎం.యస్.స్వామి
నవభారత
ఆసామి
శిరసానమామి-
11
అర్జెంటీనా
సంస్కరణల
పెద్దన్న
మనదారీ!!-
12
స్నేహం
మల్లెపొద
ఆప్యాయతల
గుభాళింపు-
స్నేహం
మల్లెపొద
ఆప్యాయతల
గుభాళింపు-
13
బంధుత్వం
విచక్షణను
కప్పేస్తే
అంధత్వం-
14
స్వార్థం
లావా
సంస్కారాన్ని
దహిస్తుంది-
స్వార్థం
లావా
సంస్కారాన్ని
దహిస్తుంది-
15
ఉగ్రవాదం
వ్యవసాయం
రక్తపాతం
ఫలసాయం-
16
మౌనం
మనసును
కోసే
మెత్తనికత్తి-
మౌనం
మనసును
కోసే
మెత్తనికత్తి-
17
నాడు
వందేమాతరం
నేడు
మందేభారతం-
18
దుఖం
రాబోవు
సుఖాల
సుగంధధూపం-
దుఖం
రాబోవు
సుఖాల
సుగంధధూపం-
కాంతారావు గారు
ReplyDeleteమీరు పంపిన నానోలు చూసాను, ఇంకా చిక్కగా ఉండేట్లు ప్రయత్నం చేయండి, మీ లాంటి లబ్ధ ప్రతిష్టుల సంవేదన నుండి రాలి పడితే నానోలకి జీవితం ఉంటుంది. ఈ చక్కటి ప్రక్రియను పది కాలాల పాటు కాపాడుకుందాము, తెలుగు భాషను బతికించుకుందాం.
ప్రేమతో
ఈగ హనుమాన్
కాంతారావు గారు! మీ నానోలని చందుపట్ల శ్రీధర్ గారు చాలా మెచ్చుకున్నారు, చిక్కగా ఉన్నాయని.
ReplyDeleteఈగ హనుమాన్
కాంతారావు గారి నానోలు బాగున్నాయి.కథలే కాదు, కవితలు బాగా చెబుతున్నారు.ఇంకా ఇంకా రాయండి.
ReplyDelete