అందరికి నమస్కారం, ప్రింట్ మీడియాలో నానోల విప్లవాన్ని చూడండి & visit NANOLU group in facebook also ఈగ హనుమాన్

Friday, March 27, 2009

చందుపట్ల శ్రీధర్ గారి నుండి అందిన కొన్ని నానోలు

చందుపట్ల శ్రీధర్ గారి నుండి అందిన కొన్ని నానోలు:

1

బొమ్మా

బొరుసూ

దేవుడూ

సైన్సూ -

2

కొలనులో

చందమామ

పేదరాసిపెద్దమ్మ

కనిపించలేదు-

నువ్వు

నేనైనా

నేనేపుడూ

నేనే-

4

అన్నా!

ఎట్లున్నవే?

సావు

రాదంట!-

5

పబ్ లో

వేలు

ప్లగ్ లో

వేలు-

6

పసికూనలు

చితికితే

యింక

దేవుడెందుకు?-


7

కార్పొరెటు

ఆస్పత్రులు

కార్పెటేసిన

అంపశయ్యలు-


8

జాబిలిపై

చెరిగిన

సంతకం

పేదరాసి పెద్దమ్మ-

9

సైన్సు

గ్యారంటీ

దేవుడు

వ్యారంటీ-

10

యివాళెందుకో

యాసిడ్

గొంతులోంచి

జారుతున్నట్టు-


11

యాసిడ్

వర్షంలో

రాల్తోన్న

మల్లెమొగ్గలు-


12

నీ

నిశ్చబ్ద

నిష్క్రమణం

శబ్దమవుతోన్నవేళ-

3 comments:

  1. ''నానో'' ల ప్రక్రియ బాగానే వుంది.

    ReplyDelete
  2. ప్రియ మిత్రమా!
    మీ ప్రొత్సాహానికి ధన్యవాదాలు, సాహిత్యం టచ్ ఉన్నవారైతే చిక్కని నానోలు రాయడానికి ప్రయత్నం చేయండి..
    మీ
    ఈగ హనుమాన్

    ReplyDelete