అందరికి నమస్కారం, ప్రింట్ మీడియాలో నానోల విప్లవాన్ని చూడండి & visit NANOLU group in facebook also ఈగ హనుమాన్

Thursday, March 19, 2009

ప్రస్థానంకి పది నానోలు:

ప్రస్థానంకి పది నానోలు:
1
దీపం
ప్రసరించడానికి
చీకటే
యానకం-

2
మంతనాలెన్ని
చేసినా
మనిషిగా
గెలిచిరా-

3
లోపలికి
ప్రవహించు
లోకంలోకి
ప్రయాణించు-

4
దేహాల
చీకటిలో
దీపం
ప్రేమ-

5
బుర్ర
పగిలిపోయుండేది
మరుపొక
వరం-

6
కళ్ళక్రింద
నల్లగా
అనుభవపు
మరకలు-

7
కడివెడు
కాగీకాగీ
కలాకండ్
నానో-

8
ఆరంతస్తులు
ఎదిగినా
ఆరడుగుల్లో
ఒదగాలి-

9
వసపిట్టలు
పెళ్ళయ్యాక
ఊసులాడ్డానికి
మాటల్లేవు-

10
తెంపబడే
పోగులన్నీ
పోగైతే
ఉరితాడే-

Monday, March 16, 2009

బొమ్మరాత యెల్లయ్య గారి నానోలు, "నేటి నిజం" లో ప్రచురించబడ్డవి (శుక్రవారం, 13-03-09):

బొమ్మరాత యెల్లయ్య గారి నానోలు, "నేటి నిజం" లో ప్రచురించబడ్డవి (శుక్రవారం, 13-03-09):

1
మనిషీ
పరిమళిస్తాడు
మానవత్వం
వికసిస్తే-

2
కల్పతరువూ
కంటపడితే
అవుతుంది
కలప తరువు-

3
వేలికొసలు
తగిలి
పులకించెను
విపంచి-

4
తూరుపు
తలుపులు
తెరిచిన
కాకులు-

5
అస్తవ్యస్తం
వ్యవస్త
మారేదాకా
అవస్థ-

6
విరులు
పలుకుతాయి
పరిమళాలు
వెదజల్లుతు-

7
తెలుగు
బతికుంది
చదువురాని
పల్లెల్లో-

8
పాపం
మహాత్ముడు
నకిలీనోట్లపైనా
నవ్వుతాడు-

9
కత్తికి
కళ్ళుండవు
కక్షకి
చావుండదు-

10
రాతిరి
చిక్కబడింది
నల్ల
వ్యపారాలతో-

11
అడవి
నరికివేత
పుడమి
కడుపుకోత-

12
చేతికి
అందు
నక్షత్రాలు
మిణుగురులు-

Sunday, March 15, 2009

డాక్టర్ కాసర్ల రంగారావు గారి నుండి అందిన కొన్ని "నానోలు":

"నానోలు":

1
చెరువు
మత్తడి
పైరు
పుత్తడి-

2
ఊరికి
చదువు
భవితకు
అడుగు-

3
జీవితం
పడవ
కాలం
కడలి-

4
అమెరికా
అమరిక
ప్రతిఒక్కరికీ
గమనిక-

5
తెరలేచింది
నాటకం
నిశ్శబ్ధం
ఆఖరిపయనం-