అందరికి నమస్కారం, ప్రింట్ మీడియాలో నానోల విప్లవాన్ని చూడండి & visit NANOLU group in facebook also ఈగ హనుమాన్

Thursday, March 19, 2009

ప్రస్థానంకి పది నానోలు:

ప్రస్థానంకి పది నానోలు:
1
దీపం
ప్రసరించడానికి
చీకటే
యానకం-

2
మంతనాలెన్ని
చేసినా
మనిషిగా
గెలిచిరా-

3
లోపలికి
ప్రవహించు
లోకంలోకి
ప్రయాణించు-

4
దేహాల
చీకటిలో
దీపం
ప్రేమ-

5
బుర్ర
పగిలిపోయుండేది
మరుపొక
వరం-

6
కళ్ళక్రింద
నల్లగా
అనుభవపు
మరకలు-

7
కడివెడు
కాగీకాగీ
కలాకండ్
నానో-

8
ఆరంతస్తులు
ఎదిగినా
ఆరడుగుల్లో
ఒదగాలి-

9
వసపిట్టలు
పెళ్ళయ్యాక
ఊసులాడ్డానికి
మాటల్లేవు-

10
తెంపబడే
పోగులన్నీ
పోగైతే
ఉరితాడే-

5 comments:

  1. అదుర్స్

    ReplyDelete
  2. ధన్యవాదాలు, అనామిక మిత్రమా!
    మీ పేరు చెబితే సంతోషిస్తాను గదా

    ReplyDelete
  3. సత్యం పలికావు

    ReplyDelete
  4. మంతనాలెన్ని
    చేసినా
    మనిషిగా... idi chaalA baagundandi.
    -Darla
    http://vrdala.blogspot.com

    ReplyDelete
  5. మిత్రులారా ధన్యవాదాలు.

    ReplyDelete