Saturday, March 28, 2009
విరోధి నామ ఉగాది ఉత్సవాల సంధర్భంగ నానోలు బ్లాగును సహజ కవి కోకిల డా|| అందెశ్రీ, ప్రముఖ కవి & విమర్శకుడు ఎస్సార్ బల్లం లు ఆవిష్కరించారు. ఫోటోలు:
విరోధి నామ ఉగాది ఉత్సవాల సంధర్భంగ పాల్వంచలో నానోలు బ్లాగును సహజ కవి కోకిల డా|| అందెశ్రీ, ప్రముఖ కవి & విమర్శకుడు ఎస్సార్ బల్లం లు ఆవిష్కరించారు. ఆ తాలూకు ఫోటోలు:
Subscribe to:
Post Comments (Atom)
భారత దేశ రోడ్ల మీద నానో కార్ల సంరంభం
ReplyDeleteతెలుగు బ్లాగ్లోకం లో నానో కవితల సంచలనం!
హనీ, అందెశ్రీ, ఎస్సార్ బల్లం గార్లకు ధన్యవాదాలు
నానో కవులకు అభినందనలు.
- ప్రభాకర్ మందార
భారత దేశ రోడ్ల మీద నానో కార్ల సంరంభం
ReplyDeleteతెలుగు బ్లాగ్లోకం లో నానో కవితల సంచలనం!
హనీ, అందెశ్రీ, ఎస్సార్ బల్లం గార్లకు ధన్యవాదాలు
నానో కవులకు అభినందనలు.
- ప్రభాకర్ మందార
సాహితీప్రియులు ఈగ హనుమాన్ గార్కి నమస్కారం,
ReplyDeleteతెలుగులో అనేక ప్రక్రియలు ఉన్నా కొత్త ప్రక్రియలకెప్పుడూ అవకాశం ఉంటుందన్నట్లు మీరు( మీరేనా?)నానోలు ప్రక్రియను చేపట్టారు. తెలుగు వచన కవితల్లో నానీలు సృష్టించిన సంచలనం వంటిదే నానోలు కూడా సృష్టించబోతోందని పిస్తుంది. ఈ ఆధునిక యాంత్రిక సమాజంలో సుదీర్ఘకవితలు చదివే వారి సంఖ్య తగ్గిపోయేఅవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ప్రయోగాలు కవిత్వాన్ని మళ్ళీ బతికిస్తాయనుకుంటున్నాను. నానోలు అంటే... " నాలుగే/పదాలు/పాదాలు/నానోలు" అని చెప్పిన మీ లక్షణం కొత్తగా వీటిని అర్థం చేసుకోవాలనుకొనే వాళ్ళకు మంచి సూచనగా ఉపయోగపడుతుంది. నానో అంటేనే సూక్షమైనదని కదా అర్థం. ఒక నానో అంటే నాలుగు పదాలు ఉన్నదవుతుంది. రెండుకంటే మించి రాస్తే వాటికి బహువచనం "లు" చేరి "నానోలు" అవుతున్నాయన్నమాట! బాగుందండీ ఇంజనీర్ గారూ...సాహిత్యంలోనూ షాక్ కొట్టించగల వ్యూహం!
మీ ప్రయత్నం వల్ల చిన్నా పెద్దా తేడా లేకుండా నానోలు రాస్తూ మళ్ళీ కవిత్వానికి మరింత వైభవం తీసుకొస్తారనే ఆశ కనిపిస్తుంది. అభినందనలు
మీ
దార్ల
(డా//దార్ల వెంకటేశ్వరరావు,
అసిస్టెంట్ ప్రొఫెసర్,తెలుగుశాఖ,సెంట్రల్ యూనివర్సిటి,హైదరాబాదు-45)
హనుమాన్ గారు, అందుకోండి నా అభినందనలు. మీ ఈ కొంగ్రొత్త కవిత ప్రయోగం/పృక్రియ, ప్రయత్నం మరింత విజయవంతంగా, సాహితీలోకంలో బాగా ప్రాచుర్యం, ఆదరణ పొందాలని అభిలషిస్తున్నాను. ఇందులో నేనూ ఒక చిరు భాగం కావటం నాకెంతో ముదావహం. - మరువం ఉష
ReplyDeleteదార్ల గారు మీ స్పందనకు ధన్యవాదాలు.
ReplyDeleteనానోల ఆత్మనెరిగి సృష్టిస్తే, నానోల్లో కవిత్వం గొప్పగా పండుద్ది. పాఠకుడి గుండెల్లో సరాసరి గుచ్చుకుని కలకలం రేపుతుంది. 2005 నుండి వస్తున్న ఈ ప్రక్రియను యూనివర్సిటీల్లో కూడా తగిన గుర్తింపును కల్గింప చేసి, ఈ నానోలని పచ్చగా పదికాలాల పాటు ఉండేట్లు మీలాంటి సాహిత్యాభిలాషులు ప్రయత్నించాలని కోరుకుంటు..
సాహిత్య మిత్రుడు
ఈగ హనుమాన్
మందార ప్రభాకరమా!!
ReplyDeleteధన్యవాదాలు మిత్రమా!
ఈగ హనుమాన్
మరువం ఉషాజి!
ReplyDeleteమీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు మిత్రమా!
నానోల నదీ ప్రవాహంలో మీరు ఒక పాయాగా పారుతున్నాందుకు చాలా సంతోషం..
అలా పారుతూనే ఉండాలని, కవిత్వాన్ని పండించాలని కోరుకుంటూ..
మీ
ఈగ హనుమాన్