అందరికి నమస్కారం, ప్రింట్ మీడియాలో నానోల విప్లవాన్ని చూడండి & visit NANOLU group in facebook also ఈగ హనుమాన్

Wednesday, September 7, 2011

ఎన్.శ్రీనివాస్ రెడ్డి గారి నానోలు

1
ఆకాశం
పులకరించింది
పూలవాన
కురిసింది -

2
ఈరోజు
నాది
రేపు
తెలీదు -

3
ప్రేయసి
ప్రేమ
అల్లుకొనే
మల్లెతీగ -

4
పూజకు
వేళయింది
పూలకు
ప్రాణసంకటం -

5
పూలకు
ఉరి
దేవుడికి
హారం -

6
నిన్న
జ్ఞాపకం
రేపు
స్వప్నం -

7
మూసిన
కనులు
కథలు
కోకొల్లలు -

8
సందేహం
విద్యార్థి
సమాధానం
ఉపాథ్యాయుడు -

9
బయట
చిరుజల్లు
లోపల
హరివిల్లు –

10
నాలుగే
పదాలు
నూరు
అర్థాలు -

No comments:

Post a Comment