అందరికి నమస్కారం, ప్రింట్ మీడియాలో నానోల విప్లవాన్ని చూడండి & visit NANOLU group in facebook also ఈగ హనుమాన్

Saturday, April 4, 2009

నానోలు, నానో కవిత్వ రూపం, శిల్పం ఇత్యాదుల పై చర్చకు ఆహ్వానం:

చర్చను కొనసాగిద్దామా??

1
?ప్ర :: చమత్కార పదాల కూర్పు కవిత్వమైపోతుందా?

నాకెందుకో ఇలాంటి ప్రక్రియల తో వ్రాసిన వాటిని కవితలని అనబుద్దవ్వదు. వీటిని కవితల శకలాలుగానో, లేక పదచిత్రాలు గానో మాత్రమే మనసు ఒప్పుకొంటుంది. (ఇది ఒక పాఠకునిగా నా అభిప్రాయం మాత్రమే. ఎందుకు వ్రాస్తున్నానంటే, ఇలాంటి అభిప్రాయంతో కూడా కొందరు పాఠకులు ఉంటారన్న విషయం మీకు తెలియాలి కనుక)

ఎనభైలలో మినీ కవితల ఉద్యమం రాకముందే శ్రీ సోమసుందర్ గారు తాము వ్రాసుకొన్న ఇలాంటి శకలాలకు రాలిన ముత్యాలు అని పేరు పెట్టుకొన్నారు.

హైకూల పరిధి, లోతు వేరు.
మినీ కవితలను కొంతవరకూ ఆస్వాదించవచ్చును. ఎందుకంటే కొన్ని ఆరేడు లైన్లు కూడా ఉండేవి కనుక.

ప్రతిభకలిగిన మీబోటి వారు ఇలాంటి పదాల విరుపులకు, చమత్కార వచనానికి పరిమితమవ్వటం కవిత్వానికి అన్యాయం చేయటమే.

బొల్లోజు బాబా


=:: బొల్లోజు బాబా గారు!

మీ కామెంట్ కు ధన్యవాదాలు.

సవినయంగా మీకు తెలియచేసుకునేదేంటంటే:
వచన కవిత్వం నా మేయిన్ ప్రాడక్టయితే, ఈ "నానోలు" నా బైప్రాడక్ట్ మాత్రమే. తెలుగు కవిత్వం నిత్య నూతనమైనది. ప్రయోగాలను ఆహ్వానిస్తుంది, ఆదరిస్తుంది, కవిత్వముంటే.

ఈ ప్రయోగంతో యెక్కువ మందిని సాహిత్యానికి దగ్గర చేసినవాల్లమవుతామేమోనని నా ఆశ. ఇవి నిలుస్తాయా లేదా అన్నది కాలమే తేలుస్తుంది. భాష మీద ప్రేమతో చేసిందే ఈ ప్రయోగం గనుక మనస్ఫూర్తిగా "నానోల" ని ఆహ్వానిద్దాం. దోశాలుంటే పరిహరించుకుంటూ నానోలని కూడా దీవీద్దాం.

మీ
ఈగ హనుమాన్

హనీ గారు
(పేరు పలకటానికి బాగుందండీ :-))

నమస్తే
మీ వివరణ బాగుంది.


2
హనుమాన్ గారు పై నానోలు చాలా బాగున్నాయి.--తెలుగు అభిమాని

all the best for your work keeping in బ్లాగ్స్ - అనామకుడు


3
ఈగ హనుమాన్ గారు,
మీరు ప్రచురించిన "నానోలు, కవిత్వం X 10-9" పుస్తకం బయట ఎక్కడా కనపడలేదు, కారణం చెప్పండి. వీలైతే అన్ని పత్రికలకు పంపి విస్తృత ప్రచారం కల్పించండి, చక్కటి ప్రిక్రియని పది కాలాల పాటు బ్రతికేట్లు దీవిద్దాం. సంజు-ప్రీతు

మిత్రమా! మీ కామెంటుకి ధన్యవాదాలు.
కొన్ని అనివార్య కారణాల వల్ల, కొద్ది కాపీలే వెయడం వల్ల, అన్ని పత్రికలకు పంపలేక పోయా. త్వరలో మళ్ళీ అచ్చొత్తించి, పత్రికలకి పంపిస్తాను.
మీ
ఈగ హనుమాన్


4
మిత్రమా!
గత కొన్ని రోజులుగా పత్రికల్లో, అంతర్జాలంలో చూస్తున్నా, "నానోలు" ప్రక్రియ చాలా ప్రతిభావంతంగా, వినూత్నంగా ఉన్నాయి, వదిలిపెట్టకండి.
రాసే వాల్లను ఎంకరేజ్ చేయండి, మీరూ విజృంభిచండి.


5
బాగున్నాయి బాగున్నాయి

ధన్యవాదాలు విజయమోహన్ గారు.
మీరు సృజనశీలురే కనుక, మీరూ ప్రయత్నించండి నానోలు నాలుగైదు.
All the best.
ఈగ హనుమాన్.


6
నానోలు చాలా భిన్నంగా ఉన్నాయి.
చక్కతి ప్రయోగం.
విజృంభించండి.


7
నానో అన్న పేరు చక్కగా కుదిరింది. ఇది మీరే కనిపెట్టారా? సముచితంగా ఉంది. మీ నానోలు కూడా చాలా బాగున్నాయి
-తెలుగు అభిమాని


8
after long time welcome to blogs
and all the best for the upcoming పోస్ట్స్ - జాన్ హైడ్


9
మంతనాలెన్ని
చేసినా
మనిషిగా... idi chaalA baagundandi.
-Darla
http://vrdala.blogspot.కం

10
Dear Hanuman garu,
mee blog choosanu.konni nanolalo Telugu lo kooda oka pankti lo rendu words vachhinattunnaye? for eg:
malamala maadina....kalapa taruvu...etc.
ika veetini Hindi loki anuvadinchaalante chaala time padutundi...paiga inta baaga ravani anukuntaanu...at least naaku saadhyam aye pani kaadu.Vijaya Raghava Reddy gaaro, SANA ane peruto naneelu translate chesina Satyanarayana garo chestaaremo adagandi.Satyanarayana garu Hyd. Hindi Academi lo pani chestunnaru


untaanu...sincerely,santha సుందరి

మీ స్పందనకు ధన్యవాదాలు, మేడం.
ఒక పదమనేది అది సంధి అయినా లేదా సరళ సమాసమైనా కావచ్చు, అందుకనే మీరు లేవనెత్తిన పదాలను, కోవలోకి క్లాస్సిఫై చేయవచ్చు.
మీరు చూచించినట్లు వారినీ సంప్రదిస్తాను, ప్రయత్నిద్దాం. వీలు కాకపోతే వదిలేద్దాం. కలకాలం మీ సాహిత్య స్నేహాన్ని కోరుకుంటూ..
మీ
ఈగ హనుమాన్


11
"ముందు మాటలు" వలన కాస్త జ్ఞనం కలిగింది నానోలను గురించి. పద్మ కళ గారి 'రెక్కలూ కూడా ఇటువంటిదే ననుకుంటా ప్రయోగం.

నీనోటి మాట
నానోలట,
నానోటి వెంట
నానాలిక!

ఎలావుందండి 20 సెకన్లలో నా నానో ప్రయోగం?
-ఉష

20 సెకన్లలో నానో చెప్పేసారుగా, ఇక సమయం తీస్కొని, తాదాత్మ్యం లోంచి మీరు నానోలు చెబితే, ఎంత బావుంటాయో, అయితే సుమా!, పాదానికి ఒకే ఒక్క పదం అది సంధి లేదా సరళ సమాసమైనా ఓకే, ఏదీ ప్రయత్నించండి చూద్దాం..
మీ
ఈగ హనుమాన్.

4 comments:

  1. హనీ గారు
    (పేరు పలకటానికి బాగుందండీ :-))

    నమస్తే
    మీ వివరణ బాగుంది.

    ఈ క్రింది లింకులో మంచి డిస్కషను జరిగింది.

    అలోక్ గారు ఇలాంటి చిన్నకవితలపై వారి అభిప్రాయాలను వెలువరించారు.
    నేనిచ్చిన సమాధానమూ ఉంది.

    వీలైతే సందర్శించండి

    http://aavakaaya.com/articleComments.aspx?articleId=1139


    సూచన: క్రిందనుంచి వరుసగా పైకి చదువుకుంటూ రండి

    భవదీయుడు
    బొల్లోజు బాబా

    ReplyDelete
  2. హనీ గారూ
    మీరు పైన నేను ఆవకాయ్.కాంలో ( http://www.aavakaaya.com/aavakaaya.com/showArticle.aspx?a=li&articleId=1425&pageNo=0) చేసిన కామెంట్లను ఇక్కడకు తీసుకొచ్చేరు. దయచేసి లింకులను కూడా ఇవ్వండి.
    వారిని అక్నాలెడ్జ్ చేసినవారవుతారు. లేనట్లయితే తమను ఇగ్నోర్ చేసారని వారు ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది.

    బొల్లోజు బాబా

    ReplyDelete
  3. లింకులు ఇస్తాను.
    మీ సజెషన్ కి ధన్యవాదాలు మిత్రమా!!
    మీ
    ఈగ హనుమాన్

    ReplyDelete
  4. సాహితీ మిత్రులారా!!
    ఒక ప్రక్రియ స్థిరికరణ చెందే క్రమములో ఎంతో చర్చ జరగాలి. ఆ ప్రక్రియ లో ఉన్న గుణ దోషాలు విడమరచబడాలి. బహుషా ఈ చర్చ లో అదే జరుగుతుందేమోననిపిస్తుంది.
    చర్చను ఎవరూ స్వప్రయోజనాలకు వాడకపోవడం తెలుగు భాషకు మంచిది.

    ReplyDelete