అందరికి నమస్కారం, ప్రింట్ మీడియాలో నానోల విప్లవాన్ని చూడండి & visit NANOLU group in facebook also ఈగ హనుమాన్

Monday, March 30, 2009

కొల్లి రాజా గారి నానోలు

సాహితీ పయనం - నానోల దాకా
1
క్లుప్త
పదాల
గుప్త
భావాలు-

2
కలాల
కూర్పులు
కాలపు
మార్పులు-

3
నవలకి
నో..నొ.. లు
నేనేలు
నానోలు-

4
తేనెల
నానోలుపై
ఈగలమై
మే వాలు

నన్నయ
భారతం
సాహితీ
గిగారధం-

ఆది మెగా
ప్రభందం
ఆమూక్తమాల్యద
పదబంధం-

........ఇంకా ఉన్నాయి

10 comments:

  1. నవ్య సాహితీ మిత్రమా!
    రాజాజీ!
    మీ స్పందనకి ధన్యవాదాలు
    ఇక నుండి మీరు యూని కోడ్ లో రాయండి. for telugu visit lekhini.org
    మీ నానోలు పోస్ట్ చేస్తున్నాను
    తొలిసారిగా అయినా బాగా రాసారు.
    నానోలు రాస్తూనే ఉండండి.
    ఇంకొంచం చిక్కగా ఉండేట్లు జాగ్రత్తపడండి, ఇది చక్కని సాహిత్య ప్రక్రియ, వీటిని త్వరలో హిందీ లోకి ఇంగ్లీష్ లోకి అనువదించి హైకూల లాగా విశ్వ వ్యాపితం చేద్దామని, వీలైతే ఈ యగ్ఞం పాలు పంచుకోండి.
    మీ సాహిత్య స్నేహితుడు
    ఈగ హనుమాన్

    ReplyDelete
  2. Hallo Hanuman garu -
    I happened to come across Nanolu on online publication of Eenadu today. I applaud your new literary experiment. I enjoyed reading various Nanolu on your blogpost.
    I didn't waste anytime to come up with my own Nanolu. I welcome your feedback on the attachment. Feel free to post it on the blog site.
    With regards,
    Amateur writer
    Raja కొల్లి""

    ReplyDelete
  3. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  4. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  5. Hanuman garu -
    Thanks for the quick response. Can you elaborate on what you meant by 'chikkaga'?

    Attached is the original Nanolu in RTS format created using the TeluguLipi editor.
    Regards,
    Raja Kolli

    ReplyDelete
  6. """మోడై
    తపస్సు
    చేస్తేనే
    వసంతం-"""
    పై నానోని గమనిస్తే తపస్సు అన్న పదం ప్రత్యేకంగా కనపడి విశాలమైన భావాన్ని పాఠకుడికి చేరవేసి ఒక ఆలోచనలో పడవేస్తుంది కద.
    చిక్కగా అనడం లో నా ఆంతర్యం కూడా అంతే మిత్రమా!!
    నానోలో కనీసం ఒక పదములోనన్నా కవిత్వాన్నీ జొప్పిస్తే, గుప్తంగా చెబితే, రాసిన కవి, రాసిన నానో వెంటాడగలరు (మిత్రమా ఇది మిమ్మల్ని ఉద్దేశించి చెబుతింది కాదు, జనరల్ గా నానోల గురించి చెబుతుందని గ్రహించగలరు). నా విమర్శని సహృదయం తో స్వీకరిస్తారని...
    మీ సాహితీ వ్యవసాయం చక్కగా సాగాలని ఆశిస్తూ..
    సాహితీ మిత్రుడు
    ఈగ హనుమాన్

    ReplyDelete
  7. Hanuman garu -
    I appreciate your clarification. I'll keep your input in mind in future.

    I started writing for nearly a year and half both in telugu and english. I have been sharing my scribblings with few of my friends, but they don't have the literary zeal to offer me with any critical feedback. So I have ben desperately looking for mentors who can guide me and it seems like I found it in you.

    You'll hear more from me.

    Regards,
    Raja Kolli

    ReplyDelete
  8. శ్రీ అలోక్ వాస్తవ్ గారికి,
    మీరు ఆవకాయ.కాం లో నానోలపై వెలిబుచ్చిన అభిప్రాయం నెట్ లో యాదృచ్చికంగా చదివా, ఈ విషయం లో ఈగ హనుమాన్ మరియు ఇతర మిత్రుల నానోలు చదివినాను,
    ఈ క్రిందివి చూద్దాము:

    మోడై
    తపస్సు
    చేస్తేనే
    వసంతం-

    లోపలికి
    ప్రవహించు
    లోకం లోకి
    ప్రయాణించు-

    మలమలమాడిన
    మండుటెండ
    వర్ష ఋతువు
    కన్నతల్లి-
    ----ఈగ హనుమాన్

    తూరుపు
    తలుపులు
    తెరిచిన
    కాకులు-

    కల్పతరువు
    కంటపడితే
    అవుతుంది
    కలప తరువు-

    ఊరినుంచి
    ఉత్తరం
    ఉండిపోయే
    చుట్టం-
    --బొమ్మరాత యెల్లయ్య

    కమ్యూనిజం
    కాలం
    కాటేయని
    నిజం-
    --శిరంశెట్టి కాంతారావు


    తెరలేచింది
    నాటకం
    నిశ్శబ్ధం
    ఆఖరిపయనం-

    చెరువు
    మత్తడి
    పైరు
    పుత్తడి-
    --డా|| కాసర్ల రంగారావు

    నేను చదివిన నానోల్లో ఇవి నాకు నచ్చి నేను ఉదహరిస్తున్నాను, అట్లె ఎవరికి నచ్చినవి మాత్రమే వారు ఉదహరించవచ్చు. కోట్ చేయవచ్చు. మినీ కవితల్లో మంచి గాఢత క్లుప్తత ఉన్నయి మాత్రమే నిలబడ్తాయి. మనకు నచ్చని విషయాల్ని కూడా చెప్పవచ్చు. అయితే ఎక్కడ ముందు వ్యక్తిగా ఆ తర్వాత రచయితగా, కవిగా సం యమనం కోల్పోవద్దు. మీరు ఆవకాయ.కాం ద్వారా వెలిబుచ్చిన అభిప్రాయాలు ఏక పక్షంగా, గర్హనీయంగా ఉన్నాయి. కవితా స్వరూపాలు మినీ కవిత్వాల్లో వచ్చినవీ, వస్తున్నవీ బలం ఉంటే నిలబడ్తాయి. పేలవమైనవి, తేలిపోయే ప్రక్రియలు కొట్టుకుపోతాయి. ఇవి ఎవరు కాదనలేని సత్యం.

    పైన నేను పేర్కొన్న తొమ్మిది నానోల్లో ఏ పదానికాపదం చదివితే అర్థం బోధపడదు. కానీ, ఆ నాలుగు పదాల సంబంధం వాటి పరస్పరాశ్రితం. అర్థం చేసుకుంటే ఎంతో విశాలమైన భావాన్ని విస్త్రుత అంశాల్ని ఈ రచయితలు లేదా నానో కవులు వ్యక్తీకరించడంలో కృతకృత్యులయ్యారని తెలుస్తుంది. నచ్చని విషయాల్ని, పొసగని అభిప్రాయాల్ని చెప్పే పద్ధతి ఉంది. ప్రక్రియా ద్వేషం పనికి రాదు. ఎక్కడ బాగుంది, ఎక్కడ జారి పోయింది చెప్పవచ్చు. వ్యక్తిగత అహంకారం తో విమర్శ సరి కాదు. మిత్రుడు శ్రీ అలోక్ వాస్తవ్ గారు ఈ విషయాల్ని దృస్టిలో పెట్టుకుని నానోల్ని మళ్ళీ వీక్షించగలరని సరియైన బేరీజు విషయంలో తమ భావాలు చెప్పగలరని అకాంక్షిస్తున్నాను.
    సాహితీ మిత్రుడు
    డా|| కాసర్ల రంగారావు.

    ReplyDelete
  9. మిత్రమా!!
    ఈ అలోక్ వాస్తవ్ గాడు ఓ పెద్ద్ వేస్ట్ ఫెల్లో.
    వాడిదంతా పారసైటిక్ అప్రోచ్. బలపడుతున్న సైట్లు చూస్తు, వాటి మీద కామెంట్ల రూపం లో వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ, ట్రాఫిక్ని డైవర్ట్ చేయాలని చూసే అంతర్జాల బ్లాక్ మెయిలర్, వీన్నసలే పట్టించుకోవద్దు.
    మీ శ్రేయోభిలాషి.

    ReplyDelete