అందరికి నమస్కారం, ప్రింట్ మీడియాలో నానోల విప్లవాన్ని చూడండి & visit NANOLU group in facebook also ఈగ హనుమాన్

Thursday, April 9, 2009

అరిపిరాల సత్యప్రసాద్ గారి నుండి అందిన నానోలు:


అరిపిరాల సత్యప్రసాద్ గారి నుండి అందిన నానోలు:
1
చెట్టుకు
పూయని
పూవు
సీతాకోకచిలక-

2
చీకటి
చివరి
మజిలి
వెలుగేగా-

3
చలికాలం
పేదవాడి
వెచ్చదనం
ఆకలిమంట-

4
బ్రతుకుబడిలో
తీపిగుర్తులు
కలలు
కల్లలు-

5
ప్రేమవనంలో
పూలూ
మూళ్ళూ
కలిసేవుంటాయ్-

6
చింపేసిన
క్యాలండర్
తిరిగిరాని
కాలం-

7
పూల
పెదాలపై
తుమ్మెద
ముద్దుగుర్తులు-

8
మనసుకు
నేత్రదానం
కవితకు
భావుకత్వం-


9
పక్షులు
వలసెళ్ళాక
కిలకిలలన్నీ
గిలకబావివే-

10
చెట్టుకొట్టే
గొడ్డలికర్ర
చెట్టుకు
పుట్టిందేగా-

11
ఆలోచన
మహావృక్షం
బోన్సాయ్
నానో-

3 comments:

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  2. పక్షులు
    వలసెళ్ళాక
    కిలకిలలన్నీ
    గిలకబావివే-
    చాలా బాగా చెప్పారు సత్యప్రసాద్ గారు.
    మీ నానోల్లో కొన్ని గొప్పగా ఉన్నాయి, కవిత్వాన్ని నాలుగు పదాల్లొ భలేగా పలికించారు, కంగ్రాట్స్.

    ReplyDelete