అందరికి నమస్కారం, ప్రింట్ మీడియాలో నానోల విప్లవాన్ని చూడండి & visit NANOLU group in facebook also ఈగ హనుమాన్

Monday, April 13, 2009

సమిధ ఆన౦ద్ గారి నానోలు:

సమిధ ఆనంద్ గారి నుండి అందిన నానోలు:
ఆశ

నిచ్చెన
దురాశ
పాము-



జీవి౦చడ౦

పాఠ౦
జీవితమే
మాష్టారు-

సమస్య
"నేను"
పరిష్కార౦
"మన౦"-

రూప౦
మనిషి
ఆత్మ
భగవ౦తుడు-

విజయ౦
పువ్వులైతే
కలలే
మొగ్గలు-


దైవపూజ౦టే
ల౦చము
మానవసేవలో
మోక్షము-


పుట్టినమనిషి
చెట్టు
చేసినపనులు
బీజాలు-

బ్రతకడ౦
హారతైతే
రైతు
కర్పూర౦-

బిడ్డలు
వెలుగు
తల్లిద౦డ్రులు
దీపాలు-
సృష్టికి
కారణ౦
చీకటితెరపై
విస్ఫోటన౦-
చూపుకి
వెలుగవసర౦
క౦టికి
చీకటవసర౦-
మనసుకు
చూపు౦టే
నరుడు
నారాయణుడు-

8 comments:

  1. సమస్య
    "నేను"
    పరిష్కార౦
    "మన౦"-
    చాలా బాగుంది.

    ReplyDelete
  2. ధన్యవాదాలు హనుమాన్ గారు,

    మీ స్పూర్తి నా ప్రయత్నానికి మరి౦త మెరుగు కాగలదు. మీ సూచనలు పాటిస్తాను.

    వ౦టవాడికి
    తినేవాడు
    రాసేవాడికి
    పాఠకుడు
    వాళ్ళే దేవుళ్ళు. నచ్చిన౦దుకు స౦తోష౦ బాబా గారు.

    ReplyDelete
  3. సత్యం లోని ఆంతర్యాన్ని వివరిస్తున్న మీ చిన్ని నానొలు నచ్చాయి. బాగున్నాయి. పలువురి నానోల సేకరణ నాకుఇష్టదాయకం గా వున్నది. చమత్కారంగా కూడా వున్నది.
    మాతో షేర్ చేసుకున్నందులకు ధన్యవాదాలు.

    ReplyDelete
  4. చాలా బాగున్నాయి.

    ReplyDelete
  5. నానోలు మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.
    అనల్పార్ధాన్ని అల్ప పదాల్లో పలికించడమే ఈ నానోల ఉద్ధేశ్యం, అది నెరవేరేట్లుగా రాసే ప్రతి కవి అభినందనీయుడే.
    ఈగ హనుమాన్

    ReplyDelete
  6. "
    దైవపూజ౦టే
    ల౦చము
    మానవసేవలో
    మోక్షము-" బాగా చెప్పారండీ !

    ReplyDelete
  7. నచ్చిన౦దుకు చాలా స౦తోష౦ పృధ్విరాజు గారు, కళగారు, పరిమళ గారు! ఈ అవకాశ౦ ఇచ్చిన హనుమాన్ గారికి పదేపదే ధన్యవాదాలు తెలియజేస్కు౦టున్నాను. వారి స్ఫుర్తి లేకపోతే ఇవి పుట్టేవి కాదు.

    ReplyDelete
  8. మీ అందరికి నానోలు నచ్చినందుకు మరియు రాస్తున్నందుకు అభినందనలు తెలియ చేస్తూ...
    ఇంకా చక్కని, చిక్కని నానోలు రాయాలని ఆకాంక్షిస్తూ..
    సాహితీ మిత్రుడు
    ఈగ హనుమాన్

    ReplyDelete