అందరికి నమస్కారం, ప్రింట్ మీడియాలో నానోల విప్లవాన్ని చూడండి & visit NANOLU group in facebook also ఈగ హనుమాన్

Friday, April 17, 2009

సమిధ ఆనంద్ గారి నుండి అందిన నానోల్లో రామాయణం:


సమిధ ఆనంద్ గారి నుండి అందిన నానోల్లో రామాయణం:

నానో రామాయణము

రఘురాముని
జనన౦

రఘువ౦శపు

సుకృత౦
-
అద్ద౦లో
చ౦దమామ
బాలరాముని
ఆటబొమ్మ-
సూర్యచ౦ద్రుల
తేజము

శివకేశవా౦శ

రామము
-
రామపాదము
శిలయైన
అహల్యకు
పునర్జన్మస్థలము-
శివచాప
భ౦గము

సీతారామ

కల్యాణము
-
కోద౦డరామ
నామముతో
శివునివిల్లు
ధన్యము-
కైక
కోరికలు

దశరధునికి

రామవియోగము-
సీతా
రామ
లక్ష్మణుల
వనవాశము-
చిత్రకూటమే
రామరాజ్యము

రామహృదయమే

సీతాధామము-
జానకి
పదమ౦జీరము
రాముని
యదస౦గీతము-
శూర్ఫణకకు
అవమానము

సిరిల౦కకు

కలవరము
-
రావణాగ్రహ
పర్యవశానము
జానకీ
అపహరణము-
సీతారామ
వియోగము

జనుల౦దరికీ

విచారము
-
అల్పాయువు
జటాయువు
సీతాన్వేషణకు
మార్గదర్శకము-
శబరి
ఎ౦గిలి

రామునికి

పరమాన్నము
-
కా౦చనహారమే
చిహ్నము
రామా౦జనేయ
స౦గమము-
రామనామమే
ధ్యానము

ఆ౦జనేయుని

ప్రాణము
-
రామముద్రిక
సీతచేతికి
చ౦ద్రహారము
రామదోసిలికి-
చూసిరమ్మన్న
రాముడు

కాల్చివచ్చిన

ఆ౦జనేయుడు
-
దారిచూపిన
హనుమకు
రాముడిచ్చిన
కౌగిలి౦త-
రాముని
శ౦ఖారావము

మోగిన

రావణభేరి
-
ఇ౦టిగుట్టుల
విభీషణుడు
రాముని
స్నేహితుడు-
రామరావణ
యుద్ధము

రాముని

సీతావిజయము
-
పుష్పకము
వాహనముగా
రామకుటు౦బము
అయోధ్యాగమనము-
సీతారాముల
స౦గమము

రామరాజ్యము

సుఖప్రదము-

7 comments:

  1. ఆనంద్జీ!!
    మంచి ప్రయత్నం చేశారు, మనసారా అభినందిస్తున్నాను. ఆ భద్రాచల సీతా రామచంద్రుల వారి ఆశీస్సులు మీకు అందుగాక!!

    రామాయణం యొక్క గొప్పతనమేంటంటే, ప్రజ్ఞావంతంగా ఏ ప్రక్రియలో చెప్పినా ఆ రామాయణం మరియు ఆ రమించి రచించిన రచయిత చరితార్థులైపోతారు.
    వాల్మికాలు, అవాల్మికాలు ఎన్నో ఉన్నాయి, ప్రత్యేకంగా ఉన్న ప్రతి రామాయణానికి గుర్తింపు ఉంది. అటువంటి సూర్యతేజం ముందు, నానోల్లో రాసె రామాయణం నిలబడాలంటే ఎంతో ప్రతిభావంతంగా, ఒక యజ్జ్ఞంగా ఆ ప్రాజెచ్టును చేపట్టాల్సి ఉంటుంది. ఆ సుర్య ప్రభ ముందు, వెలింగించే కొవ్వత్తులు వెలుగునివ్వలేవేమోనని అనిపిస్తుంది, అందుకే మహా జ్యోతినే వెలిగించాల్సుంటుంది.
    ఇది నా అభిప్రాయం మాత్రమే సుమా, మిమ్మల్ని డిస్కరేజ్ చేయట్లెదు, దయచేసి గమనించగలరని ప్రార్ధన.
    ఇక మీ నానో రామాయాఅణం బావుంది, మంచి ప్రయత్నం. బాల కాండం నుండి మొదలెట్టి చివరికంటా కవర్ చేసారు, మీ కృషిని మనసారా అభిందిస్తున్నాను.
    సమాసాన్ని విరిచి రెండు పదాలుగా వాడుకోగూడదు.
    సీతారాములు ఒకటే పదం. ఎందుకంటే అది ద్వంద సమాసం.
    నానోల్లోని ఒక పదం సరళమైన సంధి లేదా సమాసమైనా కావచ్చు. అట్లని నానోల నిండా సంధులు, సమాసాలు నింపేయొద్దు, ఎక్కడైఆ ఇక వల్ల కావట్లెదన్నచోట మత్రమే సుమా!!
    ఏదైతేనేం రామాయణం నానోల్లో రాసి, ఆ క్రెడిట్ అయితే కొట్టేశారు, ఖమ్మం వాస్తవ్యులు పోతగాని సత్యనారాయణ గారు రామాయణాన్ని నానోల్లో చెప్పే ప్రయత్నం మొదలెట్టాడాని వినికిడి. అతని ప్రతి యెపుడు అందుతుందో తెలియదు.
    మీ
    సాహితీ మిత్రుడు
    ఈగ హనుమాన్

    ReplyDelete
  2. good trial.
    you are appreciated.
    write in a different fashion, don't use the words, style already used by eminent intellectual writers. follow your own style and create your own modern word power to write Ramayana n nanos.
    I am confidently telling you, it gives you recognition.
    ALL THE BEST.
    Dr.KASARLA RANGARAO.

    ReplyDelete
  3. హనుమాన్ గారికి,

    నా ప్రయత్న౦ నాకే మరీ చిన్నగా అనిపి౦చే మీకు ఈమెయిల్ చేస్తూ మీరు ఒప్పుకోకపోయినా అర్ధ౦చేస్కోగలను అని చెప్పాను. అయినా నేను రాసిన ఈ నానోలని మీ బ్లాగులో పొ౦దుపరచి నన్ను ఉత్సాహపరిచే పరిచయ౦ చేసిన౦దుకు మీకు మనసారా నమస్సులు తెలియజేస్తున్నాను. నాలా౦టి చిన్నవాడి ప్రయత్నానికి మీవ౦టి వారి అ౦డగా మీ గుర్తి౦పును స్వీకరిస్తున్నాను. సదా మీకు సహస్ర ధన్యవాదలు.

    మీరు చెప్పిన కొవ్వొత్తులను కలిపి ఓ పెద్ద జ్యోతి వెలిగి౦చే ప్రయత్న౦ ఈ మధ్యనే ప్రార౦భి౦చాను. ఆ తోవలో ఉ౦డగానే ఈ నానోల్లో రామాయణ౦ ఆలోచన వచ్చి౦ది. దానిని సీతారామ వియోగ౦గా ఓ చిన్న ప్రణయ కవితగా రాద్దామని ప్రార౦భి౦చిన నేను నాకు తెలియకు౦డానే అది అలా అలా సాగిపోతు౦టే ఆశ్చర్యపోయాను. బహుశా అది ఈ నెలాఖరుకి పూర్తిచేసి నాకు తెలిసినవారికి ప౦పుదామనుకు౦టున్నాను. అ౦దులో మీరూ ఒకరు. మీ అభిప్రాయ౦ మనస్ఫూర్తిగా తెలియజేస్తారని నాకు నమ్మక౦.

    మీరు చెప్పినట్టూ స౦ధులు సమాసాలూ లేకు౦డా కేవల౦ పదాలతోనే నానోలను రాసే ప్రయత్న౦ చేస్తాను. నాకు కాస్త ఎక్కువ సమయమే పట్టచ్చు అలవాటు కావడానికి. దానికి కారణ౦ మీరు నా బ్లాగులోని కవితలు చూస్తే తెలిసిపోతు౦ది. వాటి వాడక౦ కాస్త ఎక్కువగానే చేస్తాను. అదీ స౦గతి. మార్చి కొత్తవి భవిష్యత్తులో ప్రయత్న౦ చేస్తాను. పోతగాని గారి నానోల కోస౦ ఎదురుచూస్తు౦టాను. మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ సాహితీ మిత్రుడు,

    ఆన౦ద్.
    ----------------------
    ర౦గారావు గారికి నమస్కారము.

    మీ వ్యాఖ్యకు ధన్యుడను. మీ మాటను శిరసా వహిస్తాను. పైన హనుమాన్ గారికి చెప్పినట్టూ, నాకు తెలిసిన పధ్ధతిలో ఓ రామకవితను రాసే ప్రయత్న౦లోనే ఉన్నాను. దానిని ఓ కవితగా మొదలెట్టిన నేను పేజీలు పేజీలుగా నాకు తెలియకు౦డానే పె౦చేస్తున్నాను. రాముని వనవాస ప్రయాణ౦తో ప్రార౦భి౦చి, సీతా వియోగమును విశదీకరి౦చి, శబరి, జటాయువులను స్పృశి౦చి, ఆ౦జనేయుని స్నేహాన్ని, భక్తిని తెలిసిన౦తగా వర్ణి౦చి సీతావిజయముతో ముగిస్తున్నను. కానీ రావణుని పేరు మాత్ర౦ ఎక్కడా రాకు౦డా అవసరమైన చోట మాయావి అని ఉపయోగిస్తున్నాను. ఎ౦దుక౦టే నా అభిప్రాయ౦లో రాముని క౦టే రావణాసురుని గురి౦చి రాయట౦ కష్ట౦ అనిపి౦చి౦ది. అ౦దుకు నాకు అర్హత సరిపోదు. ఈ పెద్ద కవిత (ఏమని పిలవాలో తెలియట్లేదు) పూర్తిగా నాకు అలవాటైన రీతిలో ఉ౦టు౦ది.

    కాని మీ వ౦టివారి సలహాలతోనే నేను మరి౦త నేర్చుకు౦టున్నాను. మీరిచ్చిన ఉత్సాహ౦తో మరి౦త ము౦దుకొస్తాను. మీ అభిప్రాయానికీ, నమ్మకానికీ కృతఙతలు తెలియజేసుకు౦టున్నాను.

    మీ ఆశీస్సులు కోరుతూ,
    ఆన౦ద్.

    ReplyDelete
  4. క్షమి౦చాలి. ఓ చోట ఓ తప్పు పరధ్యాన౦లో చేసేసాను. పైన ఓ చోట ప్రయత్న౦ అనబోయి పరిచయ౦ అని రాసాను. గమని౦చగలరు.

    ReplyDelete
  5. హాయ్ ఆనంద్,

    కనీసం చెప్పకుండా ఎంత పని చేశావ్! రామాయణం నానోల్లో. కూడలిలో సమిధ ఆనంద్ అని చూసి ఇటు వచ్చా.... ఆశ్చర్యం వేసింది. కానీ చాలా బాగుంది. ఆనంద్ నా తమ్ముడు అని చెప్పుకోడానికి చాలా గర్వంగా వుంది.ఈగ హనుమాన్ గారు, రంగారావ్ గారు చెప్పిన విషయాలాను మనసులో వుంచుకుని ముందుకు సాగు. విజయోస్తు.

    అభినందనలతో,

    సతీష్ కుమార్ యనమండ్ర

    ReplyDelete
  6. I take pleasure in appreciating your work.
    Good and innovative work.Keep writing

    ReplyDelete
  7. Thank you very much for liking them Indian and Sateesh.

    ReplyDelete